వైరల్ : కూతురు (DSP)కి సెల్యూట్ చేసిన తండ్రి (CI)

తండ్రి-కూతురు ఒకే డిపార్ట్ మెంట్. పోలీస్ డిపార్ట్ మెంట్. ఇద్దరు పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. తాజాగా తిరుపతిలో జరుగుతున్నపోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్”కు హాజరయ్యారు. అయితే తండ్రి కంటే పెద్ద హోదాలో కూతురు ఉంది. దీంతో ఇగ్నైట్ కు హాజరైన కూతురికి తండ్రి సెల్యూట్ చేశారు. ఇప్పుడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఏపీ తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్న కూతురు జెస్సీ ప్రశాంతికి తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్న శ్యామ్ సుందర్ సెల్యూట్ చాలా అరుదైన ఘటనగా నిలిచింది. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. 

ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి. ఆమె తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురు ప్రశాంతి దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు శ్యామ్. ఆ కూతురు కూడా వెంటనే సెల్యూట్ చేసి ‘ఏంటి నాన్నా?’ అంటూ తాను డ్యూటీలో ఉన్నాననే విషయం కూడా మరచిపోయి గట్టిగా నవ్వేశారు ప్రశాంతి.