అమరావతిలో జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్ష

జగన్ ప్రభుత్వంలో జేసీ బ్రదర్స్ కు చుక్కులు కనిపిస్తున్నాయి. అన్నాదమ్ములపై వరుసగా కేసులు నమోదవుతున్నాయ్. ఇంటికి వచ్చి మరీ.. నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్ దీక్షకు రెడీ అవుతున్నారు. పోలీసులు గత కొన్నిరోజులుగా నమోదు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోరాటానికి సిద్ధమయ్యారు.

అమరావతిలో ఆమరణ నిరాహార దీక్షదిగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తమ్ముడి దీక్షకు అన్న జేసీ దివాకర్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. అయితే ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆడుతున్న రాజకీయమని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. మొత్తానికి ప్రభావం కోల్పోతున్న జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాననడం.. అందుకు వేదికగా అమరావతిని ఎంచుకోవడం విశేషం.