వైరల్ : నిహారిక రొమాంటిక్ పిక్స్
కొత్తజంట నిహారిక-చైతన్య జొన్నలగడ్డల రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెల 9న నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. ఇక పెళ్లి తర్వాత భర్త, అత్తామాలతో కలిసి గుడ్లు-గోపురాలు తిరిగింది నిహారిక. అవన్నీ పూర్తికాగానే కొత్త జంట హనీమూన్ కోసం మాల్దీవులకి చెక్కిసింది. అక్కడే న్యూ ఇయర్ వేడుకలని జరుపుకుంది. అక్కడ ప్రకృతిని ప్రేమిస్తూ రొమాంటిక్గా ఫొటోలు దిగారు.
ఈ ఫొటోలని రోజుకొకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది నిహారిక. తాజాగా రెండు రొమాంటి పోజులని షేర్ చేసింది. ఇందులో సముద్రతీరాన తన భర్త హత్తుకొని ఉన్న ఫొటో ఆకట్టుకుంది. కొత్తజంట రొమాంటిక్ మూడులో ఉంది. డిస్ట్రబ్ చేయకండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా నిహారిక నటిస్తారని తెలుస్తోంది. అంతేకాదు.. భర్తతో కలిసి ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి.
View this post on Instagram
View this post on Instagram