గుడ్ న్యూస్ : ఉద్యోగులకు ప్రమోషన్స్.. కసరత్తు మొదలు

సీఎం కేసీఆర్ ఒకేసారి నిరుద్యోగులు, ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నీ శాఖల్లో ఖాళీలని పూర్తి చేస్తామని.. ఇందుకు సంబంధించిన కసరత్తుని మొదలుపెట్టాలని అధికారులని ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దానికంటే ముందు ఉద్యోగులకి ప్రమోషన్స్  ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

సచివాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్లలోని ఉద్యోగులపై కసరత్తు జరుగుతుంది. జనవరి చివరి వరకు పదోన్నతులను పూర్తి చేసిన తర్వాత ఎక్కడెక్కడా మిగిలిన ఖాళీల వివరాలు అందించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు.తెలంగాణలో ప్రస్తుతం 30 ప్రధాన శాఖలు ఉండగా, వాటికి అనుసంధానంగా మరో 40 ఇతర శాఖలు ఉన్నావి. ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పదోన్నతలు రానున్నాయి. ప్రమోషన్స్ ప్రక్రియని పైస్థాయి నుంచి మొదలెట్టి.. కింది స్థాయి వరకు పూర్తి చేయనున్నారు.