మళ్లీ మారేడుపల్లికి పుష్ప
అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. మళ్లీ పుష్ప టీమ్ మారేడుపల్లి అడవులకి వెళ్లనుంది. అక్కడ ఈ నెల 8 నుంచి షూటింగ్ నిర్వహించనున్నారు. గత నెలలో అక్కడ ఓ షెడ్యూలు జరుగుతుండగా.. యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగును నిలిపివేసింది. అక్కడో నాలుగైదు రోజుల షూటింగ్ మిగిలి ఉన్నా.. హైదరాబాద్ లో మరో షూటింగ్ లో పూర్తి చేసుకుంది. ఇప్పుడు మారేడుపల్లిలో మిగిలిపోయిన షూటింగ్ ని పూర్తి చేసేందుకు అక్కడకు వెళ్తోంది.
ఇక పుష్ప కథ విషయానికొస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో ఊరమాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వదిలిన పుష్ప ఫస్ట్ లుక్ ని చూస్టే ఆ విషయం అర్థమవుతుంది. బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. అంతేకాదు.. పుష్పలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉండనుంది. ఇందులో చిందేయడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమెకి ఏకంగా రూ. 1.5కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఒప్పుకున్నారని సమాచారమ్.