వారికి రైతుబంధు ఎందుకు ?
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలని అమలు చేస్తోంది. ఇది కాదనలేదని సత్యం. రైతుబంధు, రైతుభీమా పథకాలు రైతులు బాగా మేలు చేస్తున్నాయి. ఈ పథకాలపై కేంద్రం కూడా ప్రశంసలు కురుపించింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ పథకాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఈ గొప్ప పథకాల్లో లొసుగులు కూడా ఉన్నాయి. రైతుబంధునే తీసుకుంటే.. ఎకరం ఉన్నా.. వంద ఎకరాలు ఉన్నా రైతుబంధు పొందవచ్చు. దీంతో.. ప్రభుత్వ సాయం పేదోడి కన్నా పెద్దోడి జేబులోకి ఎక్కువగా పోతుంది.
దీనిపై పలువురు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐదు లేదా పదెకరాల లోపు మాత్రం భూమి ఉన్నవారినే రైతుబంధులు అర్హులుగా చేయాలనే సూచనలు వస్తున్నాయి. అయితే ఎక్కువ భూమి ఉన్న రైతులు కేవలం 20శాతమే అంటూ మంత్రి కేటీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అధిక భూమి ఉండి.. రైతుబంధు వద్దనుకునేవారికి ప్రభుత్వం ఓ ఆప్షన్ ఇచ్చింది. వారు రైతుబంధు డబ్బులని స్వచ్చంధంగా వెనక్కి ఇవ్వొచ్చు. ఇప్పుడు దీనికోసం గివ్ ఇట్ అప్ అనే యాప్ ని కూడా తీసుకొచ్చారు.
వ్యవసాయ పట్టాదారులు ఎవరైతే తమ రైతు బంధును వదులుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి గివ్ ఇట్ అప్ ద్వారా అవకాశాన్ని కల్పించారు. 2020 యాసంగిలో పొందిన డబ్బులను సైతం గివ్ ఇట్ అప్ ఫచ్రాన్ని పూరించి చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వ్యవసాయ విస్తీర్ణాధికారిని గానీ, మండల వ్యవసాయ అధికారికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పుడు వద్దనుకొని.. ఆ తర్వాత కావాలనుకునే వారికి కూడా ఆప్షన్ ఉంది. మరోవైపు.. ఇలా రైతుబంధు వద్దనుకునే వారికి అసలు.. రైతుబంధు ఇవ్వడమే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.