మరోసారి ఎన్సీబీ ముందుకు రియా

బాలీవుడ్ హీరో సుశాంగ్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. వీరిద్దరు కూడా బెయిల్ పై బయటికొచ్చారు. అయితే తాజాగా మరోసారి రియా, ఆమె సోదరుడు ఎన్సీబీ ఆఫీసుకు వచ్చారు.  రియా  బెయిల్ నిబంధనల ప్రకారం.. ప్రతి నెల మొదటి సోమవారం ద‌ర్యాప్తు సంస్థ ముందు హాజ‌రు కావ‌ల‌సి ఉంది. ఇలా ఆరు నెల‌ల పాటు రియా హాజ‌రు కావ‌ల‌సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు రియా ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారని తెలుస్తోంది.

మరోవైపు రియాచక్రవర్తి బాంద్రాలో కొత్త ఇళ్లుని కొనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారమ్. ప్రస్తుతం ఆమె ఓ మంచి ఇళ్లుని వెతుక్కుని పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సుశాంత్ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఎన్ సీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. వీరు డ్రగ్స్ వాడారా ? సరఫరా చేశారా ?? అన్నదానిపై ఎన్ సీబీ ఇంకా స్పష్టతనివ్వలేదు.