ఏపీ సీఎంపై తెలంగాణ భాజాపా నేతల దాడి
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్ లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై తెలంగాణ భాజాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తిరుపతి ఎన్నికల్లోనూ ధర్మాన్ని తెలిపించాలని కోరారు.
తెలంగాణ భాజాపా సీనియర్ నేత లక్షణ్ కూడా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి జగన్ తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులు ఆలయాలపై మళ్లీ మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. లేనిపక్షంలో దేవాదాయ శాఖను ఎత్తేసి… ఆలయాలను హిందూ సమాజానికి ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.