45రోజుల పాటు ఇంగ్లండ్ లాక్‌డౌన్

కరోనా విజృంభించన నేపథ్యంలో ప్రంపంచ దేశాలు లాక్‌డౌన్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడటంతో క్రమక్రమంగా లాక్‌డౌన్ ని ఎత్తేశాయి. మరోవైపు మహమ్మారి కరోనాకి వాక్సిన్లు కూడా వచ్చేస్తున్నాయ్. దీంతో ఏ దేశం కూడా మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉండవని భావించారు. కానీ బ్రిటన్ లో వెలుగులోనికి వచ్చిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్.. ఆ దేశాన్ని వణికిస్తోంది. అక్కడ ప్రతిరోజూ వేల సంఖ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి లాక్‌డౌన్ ని ఆశ్రయించింది. బుధవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి మూడో వారం వరకు లాక్‌డౌన్ ఉంటుందని తెలిపింది. అంతే.. దాదాపు 45రోజుల పాటు ఇంగ్లండ్  లాక్‌డౌన్ కానుంది అన్నమాట. మరోవైపు కొత్తరకం వైరస్ ఇప్పటికే 30 దేశాలకి పాకింది. భారత్ లోనూ ఇప్పటి వరకు 30 కొత్తరకం కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచ దేశాలు కూడా  లాక్‌డౌన్ కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.