రెండో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాస్ రెండో పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ రచయిత హిమాన్షు శర్మని పెళ్లాడింది. గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కనికా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కొత్త సంవత్సరంలో కొత్త ప్రయాణం’అని కామెంట్ పెట్టారు. వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. కుటుంబ వేడుకగా జరిగింది. నవ దంపతులకు నటి తాప్సీ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడిని కనికా పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో మనస్పర్థల కారణంగా విడిపోయారు. కానీ రీల్ లైఫ్‌లో మాత్రం కలిసి పని చేయడం విశేషం. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు.