పెంచడానికి కష్టపడుతోంది
హీరోయిన్స్ సన్నగా నాజుగ్గా మారడానికి కష్టపడుతుంటారు. ఇందుకోసం జిమ్ చేస్తారు. స్పెషల్ గా ట్రైయినర్ ని నియమించుకుంటారు. సైజులు తగ్గించుకోవడానికి భారీగా ఖర్చు పెడుతుంటారు. కానీ హీరోయిన్ మాళవిక శర్మ మాత్రం రివర్స్ లో వెళ్తోంది. కొన్నాళ్లుగా బరువు పెరగడానికి ప్రయత్నిస్తోందంట ఈ ముద్దుగుమ్మ. కానీ తన శరీరతత్వానికి బరువు పెరగడం సాధ్యం కావడం లేదంటోంది.
అందుకే 2021లో ఓ డైటీషియన్, ఓ ఫిట్ నెస్ ట్రయినర్ ను అపాయింట్ చేసుకొని మరీ కాస్త బరువు పెరుగుతానంటోంది. హీరోయిన్లు స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారు. మాళవిక శర్మ కూడా స్లిమ్ గా ఉంటుంది. కానీ అంత స్లిమ్ నెస్ పనికిరాదని, సౌత్ సినిమాల కోసం కాస్త బొద్దుగా మారాలని అనుకుంటున్నట్టు తెలిపింది మాళవిక. దానికోసం కొత్త సంవత్సరంలో కష్టపడుతోంది. నేల టికెట్ తో తెలుగు తెరకు పరిచయం అయింది మాళవిక. ఆమె నటించిన రెడ్ రిలీజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.