పవన్ ధీమా అదే !


వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మూడ్నాలుగు సినిమాలని పవన్ లైన్ పెట్టేశారు. ఇవన్నీ పవన్ ఎప్పుడు పూర్తి చేస్తారు ? అన్నది ప్రశ్న. పవన్ మాత్రం నెలకో సినిమా అవగొట్టేదాం అనేంత స్పీడుగా సినిమాలు చేస్తున్నారట. దీనికి వకీల్ సాబ్ నే ఉదాహరణ. ఈ సినిమాలో సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో కానిచ్చేశాడట. దర్శకుడు వేణు శ్రీరామ్ సీన్ వివరించడం, నాలుగు వైపుల నాలుగు కెమేరాలు పెట్టడం, సింగిల్ టేక్. ఎలా వచ్చినా ఓకె అనేయడమే జరిగిందట.

ఓ ఫైట్ కూడా చకచకా గంటల్లో తీసేసినట్లు తెలుస్తోంది. బహుశా ఈ ధీమాతోనే కావచ్చు పవన్ వరుసగా మూడు సినిమాలు ఓకె చేసి పెట్టారు. కేవలం 30 రోజుల్లో అయ్యప్పన్ రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేంధర్ రెడ్ది సినిమాలని కూడా ఇలా సింగిల్ టేకులతో కానిచ్చేస్తే.. ఈ యేడాదిలో పూర్తయిపోతాయ్. వచ్చే యేడాదికి మరో నాలుగైదు సినిమాలు పవన్ నుంచి రావొచ్చని చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. పవన్ సింగిల్ టేక్ ఆర్టిస్టిట్ గా మారిపోయాడు.