బాబోయ్.. ఆ యంగ్ హీరోకు రూ. 50కోట్ల అప్పులు !
కష్టాలన్నీ నిర్మాతలకు వుంటాయి తప్ప హీరోలకు కాదు. కానీ హీరోలు నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్న వారు చాలా మందినే ఉన్నారు. ఆదిలోనే తేరుకొని బయటపడ్డవారు కొందరైతే.. ఆశతో ముందుకెళ్లి వెళ్లి అప్పుల పాలైన వారు మరికొందరు. తాజాగా టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారమ్.
తెలుగు-తమిళ భాషల్లో సదా సినిమాలు చేసే హీరో అని చెబుతున్నారు. ఆయనకు సుమారు యాభై కోట్లకు పైగా అప్పులు వున్నాయని తెలుస్తోంది. రకరకాల కారణాల వల్ల ఆ హీరో అప్పుల పాలయినట్లు టాక్. చేసిన అప్పులు కొంత, వాటిపై వడ్డీలు మరి కొంత ఇలా పెరిగి పెరిగి యాభై కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. కొందరయితే యాభై కాదు 70 నుంచి 80 కోట్ల మేరకు చెబుతున్నారు. పోనీ హీరోగా వరుసగా నాలుగైదు సినిమాలు చేసిసి… అప్పులు తెగొడదాం అనుకోవడానికి లేదు. ఆయన హీరోకు ఆయనే నిర్మాతగా మారాల్సిన పరిస్థితి.