అలర్ట్ : ఈ ప్రైవసీ పాలసీని ఒకే చేయకుంటే వాట్సాప్ పనిచేయదు
వాట్సాప్ యాప్ కొత్త ప్రైవసీని అప్ డేట్ చేసింది. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్ సంబంధిత సర్వీసులతో యూజర్ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకుంటుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి రానుంది.
వాట్సాప్ తన యూజర్లకు ఓ నోటిఫికేషన్ పంపిస్తోంది. చాలామంది నిన్న సాయంత్రం నుంచి వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ నోటిఫికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. వాట్సాప్ అప్‌డేట్ చేసిన పాలసీకి అంగీకరించాలన్నది దాని సారాంశం. ఈ ప్రైవసీ పాలసీని విస్మరించడానికి వీల్లేదు. ఎందుకంటే పాలసీని యూజర్ ఆమోదించకుంటే ఇకపై వాట్సాప్‌ను వినియోగించలేరు.