ట్విస్ట్ : అఖిలప్రియ ప్రెగ్నెంట్
బోయినపల్లి కిడ్నాప్ కేసులోఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిలప్రియ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆ పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అఖిలప్రియకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెని చంచల్ గూడ జైలుకి తరలించారు.
ఈ నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ గర్భిణి కావడంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ కేసులో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మియాపూర్ సమీపంలోని హఫీజ్‌పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను మంగళవారం రాత్రి కిడ్నాప్ చేయించారన్న ఫిర్యాదుపై ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా ఆమె భర్త భార్గవరామ్‌లపై కేసు నమోదు చేశారు.