మిడ్ నైట్’లో రెచ్చిపోయిన అనుపమ

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మిడ్ నైట్ లో రెచ్చిపోయింది. ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఆమె రొమాన్స్ వీడియోని చూసి ప్రేక్షకులు షాక్ తింటున్నారు. అసలు విషయం ఏంటంటే ? అనుమప ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఇప్పుడీ.. ఈ సినిమా టీజర్ వచ్చేసింది. ఇది భార్య-భర్తల స్టోరి. అనుపమ పరమేశ్వరన్ – హక్కిం షాజహాన్ జంటగా నటించారు. టీజర్ లో మిడ్ నైట్ లో భార్యభర్తల మధ్య జరిగిన రొమాన్స్ ని చూపించారు. ఇందులో అనుపమ రెచ్చిపోయింది. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కాకరేపుతోంది.

ఈ లఘు చిత్రానికి ఆర్ జే షాన్ దర్శకత్వం వహించారు. అఖిల్ మిధున్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు చేసినవన్నీ ప్రేమకథా చిత్రాలే. లవ్ స్టోరీలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు ? అని అనుపమని అడిగితే.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు లవ్ స్టోరీలు చేస్తామని సమాధానం ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ టీమిండియా పేసర్ జస్మిత్ బ్రూమాతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు అనుపమ, బుమ్రా స్పందించనేలేదు.