సీపీ సజ్జనార్‌కు రాజాసింగ్ సవాల్

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు సవాల్ విసిరారు. తక్షణమే గోవుల అక్రమ రవణాని అడ్దుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.

బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను రాజాసింగ్ బయట పెట్టారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ రవాణాని అడ్డుకోకుంటే.. తానే స్వయంగా రంగంలోకి దిగుతా. అక్రమంగా గోవులని తరలిస్తున్న వాహనాలని తెలంగాణ ప్రజల ముందు పెడతానన్నారు. బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచే గోవుల అక్రమ రవాణ జరుగుతోంది. రాష్ట్రంలో పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టడం. అడ్డుకోండి. దోషులపై చట్టప్రకారం కేసులు పెట్టండి చర్యలు తీసుకోండని కోరారు.