బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. 500మిలియన్ వ్యూస్ !
దర్శకుడు త్రివిక్రమ్ కు మాటలతో మాయ చేయడం తెలుసు. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు.. ఈయన పాటల మాంత్రికుడిగా కూడా మారాడు. ఆయన దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. గత యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇందులోని పాటలు ఖండాంతరాలు దాటి ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. ప్రతిపాట సూపర్ హిట్. ఒకదానికి మించి మరోటి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ.. అల.. పాటల రికార్డుల జోరు కొనసాగుతోంది. తాజాగా బుట్టబొమ్మ ఖాతాలో 500మిలియన్ వ్యూస్ చేరాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. గీతా ఆర్ట్స్ స్పెషల్ పోస్టర్ ని వదిలింది. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అల.. నుంచి మొదటి పాటగా ‘సామజవరగమన.. ‘ వచ్చింది. సూపర్ హిట్టు అనిపించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన తెలుగు పాటల్లోనే టాప్ గా నిలిచింది. ఇదే సినిమా నుంచి వచ్చిన రెండో పాట ‘రాములో రాములా.. ‘ మాస్, క్లాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. సామజవరగమనతో పోటీ పడుతూ దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత వచ్చిన బుట్టబొమ్మ.. ఈ రెండు పాటలని మించిపోయింది. మొత్తంగా.. అల .. పాటలు రికార్డుల అలలని పారించాయి. పారిస్తూనే ఉన్నాయి. సినిమా వచ్చి యేడాది పూర్తి కావొస్తున్న ఆ రికార్డుల పర్వం మాత్రం ఆగడం లేదు. అందుకే ఇకపై త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు మాత్రమే కాదు.. పాతల మాంత్రికుడు అని కూడా పిలవాలేమో !. పాటలు ఆయన రాయకున్నా.. ఆ పాటలు వచ్చెలా.. రచయితలని సూచనలు చేశారు కదా..!