సంక్రాంతి తర్వాత కేటీఆర్’కు ముఖ్యమంత్రి బాధ్యతలు
తనయుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలన్నది సీఎం కేసీఆర్ బలమైన కోరిక. అందుకు సరైన ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడని చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తే.. ఆ క్రిడిట్ ని తనయుడు కేటీఆర్ ఖాతాలో వేసి.. వెంటనే పఠాభిషేకం చేయాలనే ప్లాన్ వేశారని చెబుతుంటారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. దుబ్బాకలో తెరాస ఓడింది. గ్రేటర్ లోనూ గ్రేట్ ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు సీఎం పోస్ట్ వాయిదా పడింది.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? సంక్రాంతి తర్వాత కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నారట. మార్చిలోగా మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనతో మరో ఎమ్మెల్యే గొంతుకలిపారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాత వందశాతం కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. కేటీఆర్ కు ఏం తక్కువ. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హైదారాబాద్ లో ఐటీని డెవలెప్ చేశారు. ప్రపంచ వేదికల నుంచి కేటీఆర్ కు ఆహ్వానాలొస్తున్నాయ్. ఆయన తోపు. సీఎం పోస్ట్ కు అర్హుడని చెప్పుకొచ్చారు.