యశదో హాస్పటల్ లో సీఎం కేసీఆర్’కు వైద్య పరీక్షలు.. అసలు ఏమైందంటే ?
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకి గురైనట్టు సమాచారమ్. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ తదితరులు బుధవారం సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో వాటి నిమిత్తమై సీఎం కేసీఆర్ ఈరోజు యశోదకు వెళ్లనున్నారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత సమస్య ఏంటన్నది తెలియనుంది.
ఇక సీఎం కేసీఆర్ ఆరోగ్యం విషయంలో రకరకాల ప్రచారం జరిగింది. జరుగుతూనే ఉంది. ఆయన ఆరోగ్యం బాగులేదు. ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగలేరని ప్రత్యర్థులుప్రచారం చేస్తుంటారు. కానీ వాటిని సీఎం కేసీఆర్ ఏమాత్రం పటించుకోకుండా.. నేను బాగున్నా. ఇంకో ముప్పైయేళ్లు నేనే సీఎం అన్నట్టుగా చెబుతుంటారు. మరోవైపు సంక్రాంతి తర్వాత మంత్రి కేటీఆర్ ని సీఎం చేయబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల ఒకరిద్దరు తెరాస నేతలే దీనిపై నోరు విప్పారు. మరీ.. వారి మాటలు నిజం అవుతాయా ? కేటీఆర్ సీఎం అవుతాడా ? అన్నది చూడాలి.