మూడో టెస్ట్ : తొలిరోజు ఆధిపత్యం ఆసీస్’దే

మూడో టెస్ట్ లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్(67; 149 బంతుల్లో 8×4), స్టీవ్‌స్మిత్‌(31; 64 బంతుల్లో 5×4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైని చెరో వికెట్‌ తీశారు.

మూడో టెస్టులో భారత్ ఆరంభం అదిరింది.  సిరాజ్‌.. డేవిడ్‌ వార్నర్‌ (5)ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు.యువ బ్యాట్స్‌మన్‌ పకోస్కీ, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ శతక భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే పకోస్కీ అందించిన రెండు క్యాచ్‌లను పంత్‌ జార విడిచాడు. పకోస్కీ ని సైని అవుట్ చేశాడు. స్టీవ్‌స్మిత్‌(30; 65 బంతుల్లో 5×4) రాగానే ధాటిగా ఆడాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు లబుషేన్‌ సైతం అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండోరోజు వీరిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేస్తారు ? అనే దానిపైనే భారత్ కు విజయవకాశాలు ఉంటాయి.