సోము సొమ్మసిల్లిపడిపోయారు

ఏపీ భాజాపా పిలుపునిచ్చిన రామతీర్థం ధర్మయాత్ర ఉద్రిక్తలకి దారితీసింది. కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. భాజాపా కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్.. తదితరులతో కలిసి భాజాపా కార్యకర్తలు కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-భాజాపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోమువీర్రాజు సొమ్మసిల్లిపడిపోయారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

మరోవైపు రామతీర్థం వద్ద, విజయనగరం డివిజన్‌లో ఈ నెలాఖరు వరకు సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రామతీర్థం కూడలి నుంచి దేవస్థానం వరకు, బోడికొండపై కోదండరాముని దేవాలయం వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. సీతారామునిపేట కూడలి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బోడికొండ మెట్ల వద్ద మరింత భద్రతకు బలగాలను మోహరించారు. కొండపైకి వెళ్లకుండా వ΄డంచెల బారికేడ్లను సిద్ధంగా ఉంచారు.