100% ఆక్యుపెన్సీ.. టాలీవుడ్’కు నిరాశే !
థియేటర్ ఆక్యుపెన్సీని 50% నుంచి 100% పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జీవోని కూడా విడుదల చేసింది. దీంతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న విజయ్ ‘మాస్టర్’ కలెక్షన్స్ అదిరిపోనున్నాయ్. మళ్లీ మునుపటిలా బాక్సాఫీస్ కళకళాడటం ఖాయం అనుకున్నారు.
తమిళనాడు తరహా తెలుగు రాష్ట్రాల్లోనూ వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు కోరారు. కానీ ఇప్పుడు వందశాతం ఆక్యుపెన్సీ విషయంలో తమిళనాడుప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేసింది. కేంద్రం ప్రభుత్వం కూడా వందశాతం ఆక్యుపెన్సీకి ఇది సరైనా సమయం కాదని వారించింది. దీంతో.. వందశాతం ఆక్యుపెన్సీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.