అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్.. లైన్ క్లియర్ !
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించింది. నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరే గెలిచినట్లు వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌లు అధికారికంగా ప్రకటించినట్లయ్యింది. దీంతో ఈ నెల 20వ తేదీన బైడైన్ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లుండగా, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు పొందాల్సి ఉంది. అయితే, గత నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత జో బైడెన్‌కు 306 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా 8కోట్ల 12లక్షల(51.3శాతం) ఓట్లను సాధించారు. ఇక రిపబ్లికన్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్ల మద్దతు మాత్రమే లభించినప్పటికీ దాదాపు 7కోట్ల 42లక్షల (46.8శాతం) ఓట్లను మాత్రం పొందగలిగారు. వీటిని ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరించింది. తాజాగా యూఎస్ కాంగ్రెస్ ధ్రువీకరించడంతో జో బైడెన్ ఎన్నిక అధికారికమైంది.