‘వకీల్ సాబ్’ టీజర్ అప్ డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. వకీల్ సాబ్ టీజర్ అప్ డేటు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ నెల 14 సాయంత్రం 6:03 నిమిషాలకి టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది.

వకీల్ సాబ్ టీజర్ కోసం అభిమానులు చాన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. దసరా కానుకగానే వకీల్ సాబ్ టీజర్ వస్తుందనుకొన్నారు. కానీ రాలేదు. న్యూ ఇయర్ కానుకగా గ్యారెంటీ అన్నారు. కానీ రాలేదు. ఇప్పుడు.. సంక్రాంతిపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అవి ఫలించాయి. సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ తో సందడి చేయనున్నారు. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడు ? అన్నది టీజర్ తో స్పష్టనీయనున్నారు. ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.