కరోనా.. కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయ్. అదే సమయంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్టైంది. కోవిడ్ కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతి కొవిడ్‌ ఆస్పత్రికి నోడల్‌ అధికారిని నియమించాలని ఏపీ వైద్యారోగ్య శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ కోవిడ్ కొత్త గైడ్ లైన్స్ :

* ప్రతి కొవిడ్‌ ఆస్పత్రికి నోడల్‌ అధికారి నియామకం

* ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైర్‌ ఆడిట్‌

*  ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స

*  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా చూడటం

*  జనసమూహాలకు అనుమతి లేదు

* కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా చర్యలు

* కరోనా టోల్‌ఫ్రీ నంబర్‌ 104 కొనసాగింపు

* కంటైన్మెంట్‌ జోన్ల నోటిఫై, ఫీవర్‌ క్లినిక్స్‌ నిర్వహణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే

*  కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను అప్పగించే సమయంలో నిబంధనలు తప్పనిసరి

*  మృతుల అంత్యక్రియల కోసం రూ.15వేలు అందించాలని నిర్ణయించింది.