కేజీఎఫ్2 టీజర్ టాక్

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీఎఫ్2’. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఈ ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే గురువారం ఈ టీజర్ లీకైంది. దీంతో చేసేదేమీ లేక.. గురువారం రాత్రికే కేజీఎఫ్ 2 టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన యశ్ ”ఎవరో మహానుభావుడు టీజర్‌ను ముందే విడుదల చేశాడు. అలా విడుదల చేయడం ద్వారా వారికి ఏం లాభం చేకూరుతుందో నాకు తెలియదు. దేవుడు వారికి అంతా మంచి చేయాలి’అని రాసుకొచ్చారు.

ఇక చాప్టర్ 2 టీజర్ సాలిడ్ గా ఉంది.  తొలి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. హీరో ఎలివేషన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయి.పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసి ఉన్న పోలీసు జీపులని కాల్చేసి.. హీటెక్కిన గన్ తో యశ్ సిగరేట్ కాల్చుకోవడం ఆకట్టుకుంది. సంజయ్‌దత్‌ ప్రతినాయకుడు అధీరగా ఇందులో కనిపించనున్నారు. తొలి భాగంలో అధీర పాత్రను అసలు చూపించలేదు. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని ముఖం కనపడనీయకుండా చూపించారు. టీజర్ లోనూ అధీర్ పాత్రని బ్యాక్ లుక్ లోనే చూపించారు. బహుశా.. ఆయన పాత్రని నేరుగా సినిమాలోనే చూపించి.. ప్రేక్షకులని సప్రైజ్ చేసేలా ఉన్నారు.