అల్లుడు ఇంకా రెడీ కాలేదు

సంక్రాంతి రేసులో బెల్లకొండ శ్రీనివాస్ ఉన్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటి వరకు ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఓ పాట బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఈ పాటని హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. రేపటితో సాంగ్ షూటింగ్ పూర్తికానుంది.

ఆ త‌ర‌వాత‌.. ఎడిటింగ్, ఫైన‌ల్ మిక్సింగ్, డీఐ ఇవ‌న్నీ జ‌ర‌గాలి. అవ‌న్నీ ఎప్పుడు పూర్త‌వుతాయో ? అన్న టెన్షన్ చిత్రబృందంలో ఉంది.
నిజానికి ఈ పాట నాలుగు రోజుల క్రిత‌మే పూర్తి కావ‌ల్సివుంది. ఓ పాట కోసం… కశ్మీర్ వెళ్లింది చిత్ర‌బృందం. అక్క‌డ అనుకోకుండా స్ట్ర‌క్ అయిపోవ‌డంతో స‌కాలంలో… హైద‌రాబాద్ రాలేక‌పోయారు. ఆ ఇబ్బందుల‌న్నీ తొల‌గి శుక్ర‌వారం చిత్ర‌బృందం హైద‌రాబాద్ చేరుకుంది. అప్ప‌టికే సెట్ రెడీ చేసి పెట్ట‌డంతో…ఆఘ‌మేఘాల‌మీద ఈ పాట‌ని మొద‌లెట్టేశారు. ఈ పాట తప్ప మిగితా పార్ట్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. హడావిడిగా సెన్సార్ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంది. రెడీ కాకముందే రిలీజ్ డేటుప్రకటించడంతో అల్లుడు టెన్షన్ పడుతున్నాడు.