ఏపీ సీఎస్ వన్ సైడ్ వార్
ఏపీలో స్థానిక సంస్థలకు వేళయిందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అంటున్నారు. అందుకు ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించాలని భావిస్తోంది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని ఏమాత్రం పట్టించుకోని సీఎస్ నిమ్మగడ్డ తన పని తాను చేసుకుపోతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి అమలులో ఉండదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని సూచించారు. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు.