పుజారా జిడ్డుపై విమర్శలు

నయా వాల్ పుజారా జిడ్డుపై విమర్శలొస్తున్నాయ్. ఆయన నెమ్మదిగా ఆడటం వలన ఇతర ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు.మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (50; 176 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించాడు. అయితే, ఇది అతడి కెరీర్‌లో అత్యంత నెమ్మదైన అర్ధశతకంగా నమోదైంది. ఇంతకుముందు పుజారా 2018లో దక్షిణాఫ్రికాపై 173 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించగా, ఈ మ్యాచ్‌లో 174 బంతుల్లో ఆ రికార్డును అధిగమించాడు.

ఈ నేపథ్యంలోనే పుజారా బ్యాటింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ విమర్శలు గుప్పించాడు. పుజారా ఇంకాస్త వేగంగా ఆడాల్సిందని చెప్పాడు. ఇలా జిడ్డుగా ఆడటం వల్ల మరో ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిపెరుగుతుందని పాటింగ్ అభిప్రాయపడ్డాడు. అయితే రికీ వ్యాఖ్యలని టీమిండియా అభిమానులు ఖండిస్తున్నారు. ఇదేం టీ20, వన్ డే మ్యాచ్ కాదు. టెస్ట్ సిరీస్ నయా వాల్ ఎంత జిడ్డుగా ఆడినా.. ఆ ప్రభావం ఇతర ఆటగాళపై ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.