‘కోబ్రా’ టీజర్ చూశారా ?

విలక్షణ నటుడు చినాయ్ విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’. అజయ్‌ జ్ఞానముత్తు దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవెన్‌స్క్రీన్‌ స్టూడియో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌ చూస్తుంటే విక్రమ్‌ తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు.

విక్రమ్-ఇర్పాన్ పఠాన్ ల మధ్య సవాల్ విసురుకొనే సన్నివేశాలు ఉంటాయని టీజర్ తోనే హింట్ ఇచ్చారు. టీజర్ లోనే విక్రమ్ ఐదారు గెటప్ లో కనిపించారు. స్టోరీ లైన్ లీక్ చేయకుండా.. విక్రమ్ విభిన్న గెటప్స్ బిట్ సీన్స్ తో టీజర్ ని కట్ చేశారు. దాని వెనక ఉన్న కథేంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.