తొలి కరోనా టీకా నాకే : ఈటెల
దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలోనే దాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రజల్లో కొవిడ్ వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగంలోని తొలి, రెండో అంతస్తుల్లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేక నిర్మాణాలను పూర్తి చేసింది. ఈ నిర్మాణాలని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు. బర్డ్‌ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. రాష్ట్రంలో రెండో దశ డ్రైరన్ విజయవంతమైందని, టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని ఈటల తెలిపారు.