వెలుగులోకి యూఎస్ రకం కరోనా వైరస్
కరోనా వైరస్ రూపు మార్చుకుంటూ కొత్తరకం వైరస్ గా మారుతున్నాయి. ఇప్పటికే యూకే, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. ఈ కొత్తరకం వైరస్ లు 70శాతం వేగంగా వ్యాపిస్తాయని చెబుతున్నారు. తాజాగా అమెరికాలోనూ కొత్తరకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల యూఎస్ లో కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం రోజూవారీ మరణాలు 4వేలకు చేరువయ్యాయి.
ఈ విజృంభణ చూస్తుంటే..ఇక్కడ ఉద్భవించిన యూఎస్ రకం అయి ఉండొచ్చు. యూకే రకంతో పాటుగా ఇది కూడా వ్యాపించింది. దాని వ్యాప్తి 50 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 52 యూకే రకం వైరస్ కేసులను గుర్తించారు. అయితే దీని వల్ల మరణాల తీవ్రత అధికంగా ఉంటుందనే ఆధారాలు మాత్రం లభించలేదని నిపుణులు అంటున్నారు.