‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి థియేటర్స్ తెరచుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయ్. ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మునుపటిలానే సినిమాలు చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన తొలి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని హిట్ చేశారు. దీంతో దర్శక-నిర్మాతలకి నమ్మకం పెరిగింది. లాక్ డౌన్ తో వాయిదా పడిన, షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు థియేటర్స్ లోకి క్యూ కడుతున్నాయి.

సంక్రాంతి కానుకగా డజనుకుపైగా సినిమాలొస్తున్నాయ్. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా టక్ జగదీష్ రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. శివ నిర్మాత దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానినటించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. జగపతిబాబు, నరేష్‌, నాజర్‌, రావు రమేష్‌, రోహిణి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.