రివ్యూ : క్రాక్


చిత్రం : క్రాక్

నటీనటులు : రవితేజ, శృతిహాసన్, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ తదితరులు

సంగీతం : థమన్

దర్శకత్వం : గోపీచంద్ మలినేని

నిర్మాత : ఠాగూర్ మధు

రిలీజ్ డేటు : జనవరి 09, 2021.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా (జనవరి 9) నిన్న ఉదయమే క్రాక్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కొన్ని పాత బాకీల సమస్యల వలన ఉదయం విడుదల కావాల్సిన సినిమా రాత్రికి రిలీజ్ అయింది. లేటైనా సినిమాని చూసేందుకు థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం విశేషం. మరీ.. వారి నిరీక్షణకి ఫలితం దక్కింది. వారి అంచనాలని క్రాక్ అందుకుందా అన్నది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

వీరశంకర్ పోతురాజు (రవితేజ) సిఐ. పెద్ద ‘క్రాక్’గాడు. ఎవడు తప్పు చేసినా వాడి తాట తీస్తాడు. అంతేకాదు.. ఎవడు ‘బ్యాక్ గ్రౌండ్’ అనే మాట వాడిన వాడిన తాట తీయనిదే నిద్రపోడు. అలాంటి వీరశంకర్ పోతురాజు కడపకు ట్రాన్స్ ఫర్ అవుతాడు. కడపలో ఓ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన కొండారెడ్డి (రవిశంకర్)కి అక్కడ ఎస్.పి క్రాక్ సిఐ రాకపై ముందే వార్నింగ్ ఇస్తాడు. దాన్ని కొండారెడ్డి లైట్ తీసుకొని మాట్లాడతాడు. తాను ఎవడికి భయపడను. ఇలాంటోళ్లని చాలామందిని చూశానని సిల్లీగా నవ్వేస్తాడు. దానికి కాలిన ఎస్.పి.. క్రాక్ సిఐ గురించి తెలుసుకోవాలంటే.. ? రాజమండి జైలులో ఉన్న కటారి కృష్ణ (సముద్రఖని)ని కలువు అని చెబుతాడు. మరీ.. కొండారెడ్డికి కటారికృష్ణ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏంటీ ? కథలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ల పాత్రలేంటీ ? తెలియాలంటే క్రాక్ సినిమా చూడాల్సిందే.

ఎలా సాగింది ? 

రవితేజ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారు ? అన్నది దర్శకుడు గోపీచంద్ మలినేనికి బాగా తెలుసు. అందుకే మొదటి 15 నిమిషాల్లోనే సినిమా జెడ్ స్వీడందుకొనేలా చేశాడు. ఇంటర్వెల్ వరకు ఆ స్వీడు కొనసాగింది. సముద్రఖని పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. అతడితో కథని చెప్పించి హీరోని బాగా ఎలివేట్ చేశారు. సలీమ్ భక్తాల్ ఎపిసోడ్(టెర్రరిస్ట్), సముద్రఖని, జాతర ఫైట్ ఏపీసోడ్స్ హైలైట్ అయ్యాయ్. దీంతో ఫస్టాప్ కేక అనిపిస్తుంది. కానీ సెకాంఢాఫ్ లో ఆ స్వీడు తగ్గింది. రొటీన్స్ సీన్స్ అనిపిస్తాయ్. కానీ మాస్, కామెడీని బాగా ఎలివేట్ చేయడంతో బోర్ అనిపించదు. ఒంగోలు బస్టాండ్ ఏపీసోడ్, క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయాయ్. మొత్తంగా.. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్.. సెకాంఢాఫ్ యావరేజ్.. మొత్తంగా క్రాక్ కేక అనిపించేలా సినిమా సాగింది.

ఎవరెలా చేశారు ?

మాస్ మహారాజ రవితేజ అభిమానులని మురిపించాలంటే ఏం చేయాలి. అవన్నీ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సముద్రఖని పాత్రని చాలా బాగా రాసుకున్నాడు. దాన్ని కథలో అద్భుతంగా వాడుకున్నాడు. ఇక రవితేజ నటన గురించి కొత్త చెప్పాల్సిన అవరసం లేదు. మరోసారి వన్ మేన్ షో చేశాడు. కామెడీ, యాక్షన్ లో అదరగొట్టేశాడు. శృతిహాసన్ బాగా చేసింది. అయితే రవితేజ-శృతిహాసన్ ల మధ్య లవ్ ట్రాక్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండు అనిపించింది. రవితేజ తర్వాత ఆ రేంజ్ లో పండిన పాత్ర సముద్రఖని. వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

క్రాక్ సెకండ్ హీరో సంగీత దర్శకుడు థమన్ అని చెప్పాలి. మంచి పాటలు ఇచ్చాడు. అంతకంటే మంచి నేపథ్య సంగీతాన్ని ఇచ్చాడు. మాస్ ఏపీసోడ్స్ అంత బాగా రావడానికి థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతమే కారణం. సినిమాటోగ్రఫీ బాగుంది. భిన్నమైన ఎమోషన్స్ ని, నేపథ్యాన్ని, కథపరంగా మార్పులని.. సినిమాటోగ్రఫీ పరంగా బాగా ఎలివేట్ చేశారు. సెకాంఢాఫ్ లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నాయని అనిపించింది. నిర్మాత విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

*  రవితేజ, సముద్రఖనిల నటన

* ఫస్టాఫ్

* మాస్ ఎలిమెంట్స్

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* రొటీన్ కథ

* సెకాంఢాఫ్

* కొన్ని పాత సినిమాల పోలిక

బాటమ్ లైన్ : క్రాక్.. కేక !

రేటింగ్ : 3.75/5

నోట్ : ఈ రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.