వైరల్ : సింగర్ సునీత పెళ్లి ఫోటోస్
సింగర్ సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బిజినెస్ మేన్ రామ్ వీరపనేని.. సునీత మెడలో మూడుముళ్లు వేశారు. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత- రామ్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాహ వేడుకకి హాజరయ్యారు.
పెళ్లిమండపంలో భర్త రామ్ వీరపనేనితో కలిసి సునీత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు
మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అవి వైరల్ అయిన సంగతి తెలిసిందే.