రాజకీయ నేతలకు ప్రధాని వార్నింగ్
ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 16 నుంచి కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాను ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వారి జాబితాను కూడా సిద్ధం చేసింది.
అయితే తొలి దశలోనే రాజకీయ నేతలకు కరోనా వాక్సిన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం కేంద్ర, ఆరోగ్యశాఖని కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దీనిపై స్పందించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు తమ వంతు వచ్చేంత వరకూ రాజకీయ నేతలు వేచి ఉండాలని సూచించారు. ఈ విషయంలో పైరవీలు చెల్లవని హెచ్చరించారు.