బన్నీ ‘ర్యాప్ సాంగ్’.. అదిరిపోయింది !

స్టయిలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూత్‌లో ఉండే క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ర్యాప్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ‘తెలుగోడి స్టైల్‌..మనమేలే బ్రాండ్‌’ అంటూ సాగే ఈ ర్యాప్‌సాంగ్‌ను తెలుగు ర్యాప్‌ సింగర్‌ రోల్‌రైడా రచించి, ఆలపించగా సంగీత దర్శకుడు తమన్‌ కంపోజ్‌ చేశారు.

‘అల.. వైకుంఠపురంలో’ రీ యూనియన్ ఫంక్షన్ లో దీనిని విడుదల చేశారు. బన్నీ మొదటి చిత్రం ‘గంగోత్రి’నుంచి ఇటీవల వచ్చిన ‘అలవైకుంఠపరములో’ చిత్రం వరకు ఆయన పోషించిన పాత్రలను, పేల్చిన డైలాగులతో ఈ పాటను మలిచారు. ఈ ర్యాప్ సాంగ్ అదిరిపోయింది.