భాజపా నేతలపై లాఠీఛార్జి
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపా అనే విషయం తెలిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలోనూ భాజాపా నేతలు అలర్ట్ అయ్యారు. యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. పట్టణంలో అధికార తెరాస ఫ్లెక్సీలు ఉంచి భాజపాకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడంపై వివాదం నెలకొంది.
ఈనేపథ్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న నేతలపై సీఐ మల్లేష్ యాదవ్ లాఠీ ఛార్జి చేశారు. అక్కడి నుంచి ఆందోళన కారులను ప్రత్యేక వాహనంలో తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.