‘మాస్టర్’ లీక్.. అయినా పట్టించుకోకండి !

విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈలోపే మాస్టర్ సినిమాలోని సీన్స్ లీకయ్యాయ్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. దీనిపై చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. పైరసీ వీడియోని చూడొచ్చు. షేర్ చేయొద్దు. సినిమాని థియేటర్స్ లోనే చూడండని రిక్వెస్ట్ చేస్తోంది.

“పైరసీపై సినిమా దర్శకుడు లోకేశ్‌ స్పందిస్తూ.. ఓ ట్వీట్‌ చేశారు. ”మాస్టర్‌’ను మీముందుకు తీసుకురావడానికి 1.5 సంవత్సరాలు సుదీర్ఘంగా ఓ పోరాటమే చేశాం. మీరు థియేటర్లలో సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. లీక్‌ అయిన వీడియో క్లిప్‌లను మీరు చూడటం గానీ.. వాటిని ఇతరులకు షేర్‌ చేయడం కానీ దయచేసి చేయకండి” అని దర్శకుడు లోకేశ్ కనగరాజు ట్విట్ చేశారు. ఇక అభిమానులు సైతం చిత్రబృందానికి ఫుల్లుగా సపోర్ట్ చేస్తోంది. మాస్టర్ లీకైనా పట్టించుకోం.. సినిమాని థియేటర్స్ లోనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కలయికలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా రిలీజ్ కి ముందే సగం లీకైంది. అది కూడా హెచ్ డీ ప్రింట్. అయినా.. టాలీవుడ్ కి వందకోట్ల దారిని చూపించింది.. ఆ సినిమా. పవర్ స్టార్ స్టామినా ఏంటన్నది చూపించింది. ఇప్పుడు మాస్టర్ విషయంలోనూ అది రిపీట్ అవుతుందని విజయ్ అభిమానులు చెబుతున్నారు. #TSMirchi కూడా మాస్టర్ సినిమాని థియేటర్స్ లోనే చూడాలని విజ్ఝప్తి చేస్తోంది.