రీ-ఎంట్రీకి వీరేంద్ర సెహ్వాగ్ రెడీ
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ రీ-ఎంట్రీకి రెడీ అయ్యారు. ఆసీస్ టూర్ లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయలపాలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 13 మందికి గాయలయ్యాయ్. మూడో టెస్టులో ఏకంగా అయిదుగురు ఆటగాళ్లు గాయాల బాట పట్టారు. సిడ్నీ మైదానంలో రిషభ్ పంత్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాకు గాయాలైన సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో బుమ్రా, విహారి, జడేజా నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించగా.. పంత్, అశ్విన్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. దీంతో ఆఖరి టెస్టులో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందోని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా గాయాలపై వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ‘ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే నాలుగో టెస్టుకు 11 మంది లేకపోతే చెప్పండి. జట్టులో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నా. క్వారంటైన్ నిబంధనలు గురించి తర్వాత ఆలోచిద్దాం’ అంటూ ట్విట్టాడు. నెటిజన్స్ సైతం సెహ్వాగ్ ని ఆహ్వానిస్తున్నారు. ఇక నాల్గో టెస్టుల సిరీస్ లో భారత్-ఆసీస్ 1-1 సమవుజ్జువులుగా నిలిచాయి. ఆఖరి టెస్టుని గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.