స్మిత్‌ ఛీటర్‌ కాదట

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ఆ జట్టు ఆటగాడు స్మిత్ చీటింగ్ చేసిన సంగతి తెలిసిందే. రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12×4, 3×6) చేసుకున్న బ్యాటింగ్‌ గార్డ్‌ మార్క్‌ను చెరిపేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో.. అంతా స్మిత్ ని చీటర్ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, స్మిత్‌ అలా చేయలేదని కెప్టెన్‌ టిమ్‌పైన్‌ వెనకేసుకొచ్చాడు.

‘ఈ విషయంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అయితే, ఆ వీడియో మరో విధంగా వైరల్‌ కావడంతో అతడు బాధపడుతున్నాడు. స్మిత్‌ టెస్టు క్రికెట్‌ ఆడటం మీరు చూస్తే ప్రతీ మ్యాచ్‌లో రోజుకు ఐదారుసార్లు అలా చేస్తాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంత్‌ గార్డ్‌ మార్క్‌ను అతడు చెరిపేయలేదు. ఒకవేళ అలా చేసినా టీమ్‌ఇండియా దీనిపై ఫిర్యాదు చేసేది. కానీ, చేయలేదు. అయితే, స్మిత్‌ అలా క్రీజు వద్దకెళ్లి అతడే బ్యాటింగ్‌ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకోవడం నేను చాలాసార్లు చూశాను’ అని పైన్‌ చెప్పుకొచ్చాడు. దీంతో స్మిత్ నే కాదు.. అతడిని వెనకేసుకొచ్చిన పైన్ కూడా చీటర్ అని నెటిజన్స్ కొత్త తిట్లతండకం మొదలెట్టారు.