వాట్సాప్ కొత్త పాలసీ.. గోప్యతకు ఏ భంగం కలగదు !

ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్ విషయంలో వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత సమాచార గోప్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేసేజింగ్ యాప్‌ ఇప్పటికే ఒకసారి వివరణ ఇచ్చుకుంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పుల చేయలేదని చెప్పింది.

* ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయి

* వాట్సాప్ మీ వ్యక్తిగత సందేశాలను చూడలేదు, కాల్స్‌ను వినలేదు. అలాగే ఫేస్‌బుక్ కూడా.

* మీరు షేర్ చేసిన లొకేషన్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్ చూడలేవు.

* వాట్సాప్‌ మీ కాంటాక్ట్‌ల గురించి ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోదు.

* వాట్సాప్‌ గ్రూప్‌లు ప్రైవేటుగానే ఉంటాయి.

*  మీ సందేశాలు అదృశ్యమయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. 

* అలాగే మీ డేటాను మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటూ స్పష్టత ఇచ్చింది.