అక్షయ్ కుమార్’ని వాడుకున్న అఖిలప్రియ
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆమె దాదాపు 300 ప్రశ్నలు వేశారట. వీటిలో చాలా వాటికి దాట వేసే ధోరణి అవలంభించారట. కేసులో ఇప్పటివరకు పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను అఖిలప్రియ ముందుంచడంతో చేసేది లేక కొన్నింటిని ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ కిడ్నాప్ ప్లాన్ ని ఓ సినిమా నుంచి కాపీ కొట్టారట.
బాలివుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన “స్పెషల్ 26” చిత్రాన్ని అనుసరించి కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా ఫక్కీ కిడ్నాప్‌నకు అఖిలప్రియ అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. కిడ్నాప్‌కు ముందు అక్షయ్‌కుమార్ సినిమా గురించి చంద్రహాస్‌తో అఖిలప్రియ చెప్పినట్లు వినికిడి. అఖిలప్రియ ఆదేశాలతోనే అక్షయ్‌కుమార్ సినిమాను కిడ్నాప్ గ్యాంగ్‌కు అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్, చంద్రహాస్ చూపించినట్లు తెలుస్తోంది. హఫీజ్‌పేటలోని 25ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్ రావు సోదరులతో చర్చించేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు నిరాకరించినట్లు అఖిలప్రియ పోలీసుల వద్ద తెలిపినట్లు సమాచారం.