ఇండస్ట్రీ నమ్మకాన్నినిలబెట్టిన ‘మాస్టర్’

‘మాస్టర్’పై విజయ్ అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ బోలేడు ఆశలు పెట్టుకుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తెరచుకున్నాయి. ఈ గ్యాప్ లో ప్రేక్షకులకి ఓటీటీలకు అలవాటు పడ్డారు. మరోవైపు కరోనా పూర్తిగా పోలేదు. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా ? వారిని మళ్లీ థియేటర్స్ కి తీసుకురావాలంటే.. విజయ్ నటించిన మాస్టర్ సినిమాని థియేటర్స్ లోకి తీసుకు రావాలి. అది కూడా సంక్రాంతికి రావాలని కోలీవుడ్ ఆశపడింది. సమ్మర్ కు రావాలనుకున్న మాస్టర్ ని సంక్రాంతికే వచ్చే విధంగా ఒప్పించింది.

మాస్టర్ కూడా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్టర్ ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు. కరోనా వేళ.. పిల్లలు, మహిళలు, పెద్దోళ్లు థియేటర్స్ రారు అనుకున్నారు. కానీ పెద్దా-చిన్నా అనే తేడా లేకుండా థియేటర్స్ కు జనాలు తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ ని కొన్ని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అది మా స్టార్  కు ఉన్న క్రేజ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్ సినిమాపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. అయితే అసలు టాక్ ఏంటి ? అన్నది తెలియాలంటే.. ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే.