డిజిటల్ రుణాలు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం !

డిజిటల్ రుణాలు ఆత్మహత్యలకి దారి తీస్తున్నాయి. ఇటీవల డిజిటల్ రుణాలు పొంది, వడ్డీలు కట్టలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ రుణాల దారుణాలపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాలను ఈ గ్రూప్‌ పరిశీలిస్తుంది.

‘ఆర్థికరంగంలో వివిధ డిజిటల్‌ పద్ధతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడమనేది స్వాగతించదగినది. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. దీన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. డేటా భద్రత, ప్రైవసీ, విశ్వసనీయత, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన విధంగా నియమ, నిబంధనలు తయారు చేయాలి’ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.