ట్విట్టర్ రివ్యూ : రెడ్

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. సంక్రాంతి కానుకగా ‘రెడ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. ప్రేక్షకులు సినిమా టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సినిమాపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ నటన అదిరిపోయింది. వన్ మేన్ షో చేశారని చెబుతున్నారు. అద్భుతమైన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రొటీన్ సీన్స్ పడ్డాయ్. సెకాంఢాప్ దెబ్బతీసిందని చెబుతున్నారు.

ప్రీ ఇంటర్వెల్ ఏపీసోడ్, ట్విస్ట్ లు రివీల్ చేయడం, క్లైమాక్స్ ఎపీసోడ్ అదిరిపోయాయ్. ఫస్టాఫ్ బాగుంది. నేపథ్య సంగీతం బాగుంది. హీరోయిన్ మాళవిక శర్మ గ్లామర్ ప్లస్ అయింది. ఐటమ్ సాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే.. సినిమా యావరేజ్ గా ఉంది. కామెడీ వర్కవుట్ కాలేదు. సెకాంఢాఫ్ బోరింగ్ గా సాగిందని చెబుతున్నారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా సాగలేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి.. రెడ్ పై మిక్సి డ్ టాక్ వినిపిస్తోంది.