దిల్ రాజు కాదు.. కిల్ రాజు !


టాలీవుడ్ లో బడా నిర్మాతలదే రాజ్యం. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లదే హవా. వీరి చేతిలోనే థియేటర్స్ ఉంటాయ్. వీరంతా కలిసి చిన్ని సినిమాలని తొక్కేస్తారని చిన్ని సినిమాల నిర్మాతలు ఆరోపిస్తుంటారు. అప్పుడప్పుడు కడుపు కాలి మీడియా ముందుకొచ్చిన సందర్భాలున్నాయి. తాజాగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను బ్లాస్ట్ అయ్యారు. క్రాక్ సినిమా డిస్ట్రిబ్యూట్ హక్కులని తీసుకున్న శివ.. దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు కాదు.. కిల్ రాజు అంటూ ఆరోపించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం క్రాక్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు నైజాంలో థియేటర్స్ దక్కకుండా దిల్ రాజు చేశారని వరంగల్ శివ ఆరోపించారు. మీడియా ముందుకొచ్చి.. దిల్ రాజు చేస్తున్న మోసాలని బయటపెట్టారు. క్రాక్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకుండా డబ్బింగ్ సినిమా మాస్టర్ కు థియేటర్స్ కేటాయించడంపై ఫైర్ అయ్యారు. తనని ఒక్కడినే కాదు.. చాలా మంది దిల్ రాజుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఇండస్ట్రీ సమస్య అన్నారు. మరీ… వరంగల్ శివ ఆరోపణలపై దిల్ రాజు రియాక్షన్ ఎలా ఉండనుంది ? అన్నది చూడాలి.