ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్
ఇటీవల వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్.. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. వీటిని అంగీకరించకపోతే యూజర్ మొబైల్ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ పని చేయదని ప్రకటించింది. అయితే ఇప్పుడీ.. ఈ నిర్ణయాన్ని మూడ్నెళ్ల వరకు వాయిదా వేసింది.
“యూజర్లు కొత్త అప్డేట్ను అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 8 న ఎవరి అకౌంట్లను నిలిపివేయం.. తొలగించం. అలానే వాట్సాప్‌లో గోప్యత, భద్రత ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. మే 15న కొత్త బిజినెస్ ఫీచర్ అందుబాటులోకి రాకముందే మేము పాలసీని సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తాము’’ అని వాట్సాప్ ప్రకటన చేసింది.