పూర్తిస్థాయిలో స్కూల్స్ ఓపెన్’కు కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయ్. వాక్సిన్ కూడా వచ్చేసింది. ఇక కరోనా భయం పోయినట్టే. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థలని తెరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి ఆపై తరగతులు తెరిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఫిబ్రవరి 15 నుంచి 6,7వ తరగతులని కూడా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

మొత్తంగా క్రమక్రమంగా పూర్తి స్థాయిలో స్కూల్స్ తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. వందరోజుల పాటు స్కూల్స్ నిర్వహించి.. ఆ తర్వాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ ఉండదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.